రీసెంట్ గా బేబీమూవీతో క్రేజీ యంగ్‌ హీరోగా మారాడు విరాజ్‌ అశ్విన్‌‘. పూజిత పొన్నాడతో కలిసి జోరుగా హుషారుగాఅంటూ మరోసారి తెలుగు ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడు. అనుప్రసాద్ దర్శకత్వంలో శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. జెన్యూన్‌ లవ్‌స్టోరీతో యూత్‌ ఆడియెన్స్‌నే కాక అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్ర కథ ఉంటుందంటున్నారు మేకర్స్‌. ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కష్ణ చైతన్య , సీనియర్ పాత్రికేయులు టీవీ 5 మూర్తి, వినాయకరావు, సురేష్ కొండేటి లు రిలీజ్‌ చేశారు.

ఈ చిత్ర టీజర్‌ విజువల్స్‌ ఇంప్రెసివ్‌గా ఉందన్నారు నిర్మాత కెఎల్‌ దామోదరప్రసాద్. జెన్యూన్‌ లవ్‌స్టోరీస్‌ కు నా సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుందన్నారు బెక్కెం వేణుగోపాల్ . ఈ చిత్ర కథే కాదు డైలాగ్స్ కూడా హార్ట్‌ టచింగ్‌ గా ఉందన్నారు రచయిత దర్శకుడు కృష్ణప్రసాద్‌. ఈ చిత్రం పెద్ద హిట్టవ్వాలని ఆకాంక్షించారు అతిధులు ఆహ్వానితులు.

Leave a comment

error: Content is protected !!