నవ్వించడం అంటే కామెడీ కాదు. కామెడీ చేయడం అంటే నవ్వినంత తేలికా కాదు. అదొక యోగం. అందులో తలపండిన ఎందరో హాస్యనటులు టాలీవుడ్ తెరపై నవ్వులు పూయించారు. అందులో అందగాడు బాబూ మోహన్ ఒకరు. నలుపు చాలా నాణ్యమని ..ఆ రంగును తన ముఖానికి అందంగా పులుముకొని నవ్వుల్ని కూడా పండించ వచ్చని రుజువుచేశారు బాబూ మోహన్ . బాబూ మోహన్ ఖమ్మం జిల్లాలోని బీరోలులో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశారు. ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. అంకుశం చిత్రంలో పాయే పాయే అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఇక మామగారు సినిమాలో కోట శ్రీనివాసరావు తో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించారు. మాయలోడు, సినిమాతో స్టార్ కామిడియన్ అయ్యారు. బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. నేడు బాబూమోహన్ పుట్టిన రోజు..ఆ నవ్వుల మోహనుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్. హ్యాపీబర్త్ డే బాబూ మోహన్

Leave a comment

error: Content is protected !!