ముద్దు బంతి పువ్వులాంటి ముద్దులొలికే మోముతో.. చందమామలా చిరునవ్వులు చిందిస్తుంది ఆ చిన్నది.  అంత చూడచక్కని ఆమెలోనే ఓ కళా సరస్వతి కొలువుదీరినట్లుగా కనిపిస్తుంది .. చిన్న వయసులోనే బుల్లితెర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తరాది.. దక్షిణాది వంటి ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఇంటికీ చేరువైంది. ‘మార్నింగ్‌ వాక్‌’ అనే చిత్రంతో బాలనటిగా వెండితెరపై మెరిసింది  ఈ క్యూట్  సుందరి.

 2013లో విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఉయ్యాలా జంపాలా’  చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో ఉమాదేవిగా ఆ ముద్దుగుమ్మ చేసిన అల్లరికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’  సినిమాలో పరిణీత అనే ఇంటర్‌ విద్యార్థిగా తన అమాయకమైన నటనతో మరోసారి కుర్రాళ్ల గుండెలను పిండి చేసింది. ఈ భామకు తెలుగులో మంచి హిట్లు పడినప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్రమంగా తెరమరుగైంది. ఇప్పుడు అమ్మడు గ్లామర్ డోస్ కాస్తంత పెంచి.. తిరిగి టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. నేడు అవికా గోర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా  ఆ సుందరికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే అవికా గోర్

 

 

Leave a comment

error: Content is protected !!