సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”. ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి “వధువు” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా “వధువు” వెబ్ సిరీస్ హైలైట్స్, ఇందులో నటించిన ఎక్సీపిరియన్స్ తెలిపింది అవికా గోర్. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఇటీవల మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించాను. అదే టైమ్ లో “వధువు” ప్రాజెక్ట్ గురించి చెప్పారు. బెంగాలీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఇందును తెలుగులోకి “వధువు”గా తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నేను గతంలో చేసిన బబ్లీనెస్ ఈ క్యారెక్టర్ లో ఉండదు. ఒక యూనిక్ క్యారెక్టర్ దొరికింది. ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉండవు. థ్రిల్లర్ జానర్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మీరు ట్రైలర్ లో చూసినట్లు మిస్టరీ సన్నివేశాలు ఉంటాయి. టీవీలో సీరియల్స్ చేసిన అనుభవం నాకు ఉంది. టీవీ ఆడియెన్స్ కు ఎలాంటి కంటెంట్ ఇష్టమో..అది “వధువు” లో ఉంటుంది. ఇప్పటిదాకా ఓటీటీ చూడకుండా టీవీ కంటెంట్ ఇష్టపడేవారు “వధువు” కోసం ఓటీటీకి వస్తారనే నమ్మకం ఉంది. ఆ సెక్షన్ ఆడియెన్స్ ను “వధువు”తో బాగా ఆకర్షించబోతున్నాం.

Leave a comment

error: Content is protected !!