క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత సుభాష్ నూతలపాటి మీడియాతో ముచ్చటించారు. మహేష్ రెడ్డి గారు నాకు కథను నెరేట్ చేసిన విధానం నచ్చింది. ఎంతో డీటైలింగ్‌గా అనిపించింది. క్లూస్ డిపార్ట్మెంట్ గురించి బాగా చెప్పారు. కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్ చేశాం. నేను యూకేలో ఎంబీఏ స్టూడెంట్‌ని. ఇండియాకు వచ్చినప్పుడు మా నాన్న గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందని అన్నారు. ఆయకు సపోర్ట్‌గా నిలిచాను. ఇంతకు ముందే వేరే బ్యానర్‌లో ఓ సినిమాను చేశాం. మాకు టెక్నికల్‌గా అథర్వ రెండో చిత్రం. ప్రస్తుతం అందరూ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడుతున్నారు. ఇందులో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. క్లూస్ డిపార్ట్మెంట్ మీద ఇంత వరకు సినిమా రాలేదు. వారు చేసే పనిని ఇందులో మరింత డీటైలింగ్‌గా చూపిస్తాం. ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రతీ వారం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. తరువాత నాని, ప్రభాస్ గార్ల సినిమాలున్నాయి. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటుంది. యానిమల్ ప్రభావం ఉంటుందని తెలిసినా మాకు ఇదే సరైన డేట్ అనిపించింది.