Sardar 2 :  2022లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన “సర్దార్” చిత్రానికి సీక్వెల్‌గా “సర్దార్ 2” తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కార్తీ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. దర్శకుడు పి.ఎస్.మిత్రన్ మళ్లీ కార్తీతో కలిసి పనిచేయనున్నారు. ఇటీవలే నటి ఆషికా రంగనాథ్‌ను చిత్రానికి నాయికగా ఎంపిక చేశారు.

జులై నుండి చెన్నైలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. భారీ సెట్‌ను నిర్మించి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సినిమాలో ఎక్కువ భాగం కజకిస్థాన్, అజర్‌బైజాన్, జార్జియా వంటి దేశాల్లో చిత్రీకరించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుండగా, జార్జ్‌ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. “సర్దార్ 2” కోసం కార్తీ తన లుక్‌ను మార్చుకున్నారు. ఈ చిత్రంలో ఆయన స్పైగా కనిపించనున్నారు. “సర్దార్” విజయవంతమైన నేపథ్యంలో “సర్దార్ 2″పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a comment

error: Content is protected !!