చిత్రం: ఏనుగు
నటి నటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి, కెజిఎఫ్ రామచంద్రరాజు, తదితరులు
సంగీతం: ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: గోపినాధ్
ఎడిటర్: యాంథోని
నిర్మాత: సతీష్ కుమార్
రచన, దర్శకత్వం: హరి
విడుదల తేదీ: జూలై 1, 2022

కథ: రామనాథపురం జిల్లాలో పెద్ద పెద్ద వ్యాపారాలను నడిపే అత్యంత శక్తివంతమైన కుటుంభం PRV కుటుంబం. అతనికి 4 కుమారులు మొదటి భార్య కి సంతానం ముగ్గురు (సముద్రఖని, బోస్ వెంకట్ మరియు సంజీవ్). మొదటి భార్య చనిపోవడంతో రెండొవ పెళ్లి చేసుకుంటాడు. రెండవ భార్య (రాధిక శరత్‌కుమార్) కి సంతానం రవిచంద్రన్ (అరుణ్ విజయ్). తన కుటుంబానికి గాని, అన్నయలకి గాని ఎలాంటి ఆపద వచ్చిన అడ్డు వచ్చి ఎదురు తిరిగేది రవిచంద్రన్. సోదరులందరు కలిసి ఉన్నప్పటికీ సవతి కొడుకు లాగే చూస్తారు. PRV యొక్క పాత స్నేహితుడు సముద్రమ్, PRV కుటుంబం కారణంగానే తన చిన్న కొడుకు చనిపోయాడని పెద్ద కొడుకు లింగం ద్వారా PRV కుటుంభం మొత్తాన్ని చిన్నా భిన్నం చేయాలనీ ప్రతీకారం మొదలు పెడతాడు. ఈ ప్రతికార గొడవల్లో సముధ్రఖని కూతురు “అమ్ము అభిరామి” కనపడకుండపోతుంది? సముద్రమ్ PRV కుటుంబాన్ని చిన్న భిన్నం చేశాడా? సముధ్రఖని కూతురుని కనిపెట్టారా లేదా అనేది కథ?

కధనం,విశ్లేషణ: ఫస్ట్ ఆఫ్ లో తన చిన్న కొడుకు చనిపొయ్యిన బాధలో సముద్రమ్ ఫ్యామిలీ ప్రతి కారానికి PRV ఫ్యామిలీ మీద కాలు దువ్వుతుంటుంది. దానికి తోడు, సెంట్రల్ జైలు నుంచి వచ్చిన సముద్రమ్ పెద్ద కొడుకు పగ తీర్చుకోవడానికి ప్ల్యాన్ చేస్తుంటాడు. ఎన్ని కృతంతాలు జరుగుతున్న “అరుణ్ విజయ్” తన కుటుంబానికి హాని జరగకుండా రక్షకుడు లాగా కాపాడుతుంటాడు. అరుణ్ విజయ్ విలన్స్ వేటాడే యాక్షన్ సన్నివేశాలు అన్ని, సింగం సిరీస్ లు తలపిస్తుంటాయి. అరుణ్ విజయ్ కి ఇది ఎక్సట్రార్డినరి హిట్ అనుకోవచ్చు. జెబమలర్ (ప్రియా భవానీ శంకర్) ఆఫ్ హిందూ – ఆఫ్ క్రిష్టియన్ ఈ అమ్మాయిని చూడగానే అరుణ్ విజయ్ లవ్ లో పడిపోతాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సెకండ్ ఆఫ్ లో రవి యొక్క సగం మేనకోడలు పాప (అమ్ము అభిరామి) ఒక రోజు కనపడకుండా పోతుంది. దాంతో PRV ఫ్యామిలీ చిన్నా భిన్నం అయ్యిపోతుంది. ముఖ్యంగా రాధికా శరత్ కుమార్ తో సాగే ఎమోషనల్ సీన్స్, మేనకోడలు కోసం తిరిగే గాలింపు సీన్స్, క్లైమాక్స్ లో విలన్ ఏ కంటతడి పెట్టె సీన్స్, అరుణ్ విజయ్ ఇల్లు వదిలి వెళ్ళిపొయ్యేటప్పుడు కిడ్స్ తో సాగే ఎమోషన్స్ సీక్వెన్స్ ఇలా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. సముధ్రఖని తనడైన యాక్టింగ్ తో వెర్సిటెయిల్ అనిపించుకున్నాడు. యోగి బాబు నవ్విస్తూ, ఏడిపిస్తూ థియేటర్ లో అదరకొడతాడు. యాక్షన్ తో పాటు కులవృత్తి మీద సందేశాత్మకమైన మెస్సేజ్ ఇవ్వడం సూపర్బ్.

ఎప్పటి లాగే హరి తన మార్క్ కనబరిచిన అక్కడక్కడ సీన్స్ ఇంకా బలంగా రాసుకొని ఉంటె బాగుండు. సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యిన స్క్రీన్ ప్లే పరిగెట్టడంతో బోర్ అనిపించదు. ఓవర్ ఆల్ సినిమా బాగానే అనిపిస్తుంది. విలనిజం కొంచెం వీక్ అనిపించినప్పటికీ హరి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు.  

నటి నటుల పెర్ఫామెన్స్:  టైటిల్ కి తగ్గట్టు గా అరుణ్ విజయ్ ఏనుగు లాగ విజృభించేసాడు. యాక్టింగ్ తో, ఎమోషన్స్ ఒక ఆట ఆడేసుకున్నాడు. ప్రియా భవానీ శంకర్ పక్కింటి అమ్మాయిలా చాలా సెట్టిల్డ్ గా యాక్టింగ్ చేస్తూ రాణించింది. సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అదుర్స్ అంతే. రాధికా శరత్‌కుమార్ యాక్టింగ్ ఈ సినిమాకి ఓ హైలెట్. అమ్ము అభిరామి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తుంది అంత బాగుంటుంది యాక్టింగ్. యోగి బాబు స్క్రీన్ మీద ఉన్నంత సేపు నవ్వులే నవ్వులు. తదితరులు కూడ బాగా ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: డైరెక్టర్ హరి థియేటర్ లో ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తుంటాడు. ఏనుగు సినిమాతో కూడా పరంపరం కొనసాగించిన అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ ని ఇంకా బాగా తీర్చిదిద్ది ఉంటె బాగుండేది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాడుకోదగ్గ లిరిక్స్ రాసుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఎడిటర్, సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగానే ఖర్చుపెట్టి నట్టు తెలుస్తుంది.

రేటింగ్: 3/5

బాటమ్ లైన్: కలుపు మొక్కలని అణిచివేసిన “ఏనుగు”

Review By: Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!