ARM movie : మలయాళ సూపర్ స్టార్ టొవినో థామస్ తన కెరీర్‌లో 50వ చిత్రంగా ‘ఏఆర్‌యమ్’ చిత్రాన్ని ఎంచుకున్నారు. జితిన్ లాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్న పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి ఈ చిత్రంలో టొవినో జంటగా నటించడంతో తెలుగు ఆడియెన్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి చూపించారు. విడుదలైన 5 రోజుల్లోనే ‘ఏఆర్‌యమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు ధిబూ నీనన్ థామస్ ఈ చిత్రానికి మంత్రముగ్ధులను చేసే సంగీతాన్ని అందించారు. టొవినో థామస్ 50వ చిత్రంగా వచ్చిన ‘ఏఆర్‌యమ్’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Leave a comment

error: Content is protected !!