కలల రాకుమారుడు అనే పదానికి అసలైన నిర్వచనం అతడు. అప్పటి తరం అమ్మాయిలు అతడి మ్యాన్లీ లుక్స్ కు, హ్యాండ్సమ్ ఫేస్ కు మంత్ర ముగ్ధులైపోయారు. తొలి చిత్రంతోనే దక్షిణాది ప్రేక్షకుల్ని తన రూపంతోనూ, అభినయం తోనూ కట్టిపడేసిన అతడి పేరు అరవింద స్వామి. కళాత్మక దర్శకుడు మణిరత్నానికి దొరికిన ఆణిముత్యం అతడు. 1991 లో తమిళ తెరంగేట్రం చేసిన అరవింద స్వామి నటించిన చిత్రాలు కేవలం ముప్పై రెండు మాత్రమే. అయినప్పటికీ అతగాడు .. ఇప్పటికీ దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకమే.
అరవింద్ స్వామి చెన్నైలో జన్మించాడు. అతన్ని పెంచిన తల్లిదండ్రులు పారిశ్రామికవేత్త వి. డి. స్వామి,, భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. శిష్య స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషన్ల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అరవింద్ స్వామి చిన్నప్పుడు వైద్యుడు కావాలనుకున్నాడు. పాకెట్ మనీ కోసం చిన్నప్పుడు ప్రకటనల్లో నటించేవాడు. ఆ తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం అతన్ని ఒక ప్రకటనలో చూసి తనను ఓ సారి కలవమని అడిగాడు. మణిరత్నం, సంతోష్ శివన్ అతనికి సినిమా నిర్మాణంలో మెలకువలు నేర్పించారు. అలా అతగాడు మణిరత్నం ‘దళపతి’ చిత్రంలో కలెక్టర్ గా నటించి అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు. ఆ తర్వాత రోజా, బొంబాయ్, మెరుపుకలలు చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పటినుంచి 2000 వరకూ పలు తమిళ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించాడు. 1995 లో సి.ఉమామహేశ్వరరావు ‘మౌనం’ చిత్రంతో తెలుగు తెరకూ పరిచయమయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో రామ్ చరణ్ ధ్రువ లో విలన్ గా మెరిసాడు. ప్రస్తుతం ‘తలైవి’ లో యం.జీ.ఆర్ గా నటిస్తున్నాడు అరవింద స్వామి. నేడు అరవింద స్వామి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
Aravinda Swamy Rejected Super Hit Telugu Film ?