చిత్రం : ఏప్రిల్ 28 ఏం జరిగింది..?

నటీనటులు : డా.రంజిత్, షెర్రీ అగర్వాల్, తనికెళ్లభరణి, అజయ్, చమ్మక్‌చంద్ర తదితరులు

సంగీతం : సందీప్‌కుమార్

బ్యానర్ : వీజీ ఎంటర్‌టైన్‌మెంట్స్

దర్శకత్వం : వీరాస్వామి

విడుదల తేది : ఫిబ్రవరి 27, 2021

యువ నటుడు నిఖిల్, బిగ్‌బాస్ ఫేం సోహైల్ ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’ చిత్రం ట్రైలర్ చూసి ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందని చెప్పడం & సినిమాకి సంబంధించిన ప్రచారచిత్రాలకి మంచి స్పందన రావడం కూడా సినిమాపై మంచి బజ్ ఏర్పడడానికి ఓ కారణమని చెప్పొచ్చు. అయితే నిఖిల్, సోహైల్ చెప్పినట్లుగా నిజంగా ఈ సినిమా ఆడియన్స్ ను సస్పెన్స్ తో అలరిచిందా లేదా..? ఈ సినిమా ఆసక్తికరంగా సాగిందా లేదా..? అనేది రివ్యూలోచూద్దాం.

కథ : విహారి (రంజిత్) సినిమాలకు తను రాసిన కథలు అందిస్తుంటాడు. రచయితగా తను రాసిన కథలను రెగ్యులర్‌గా నిర్మాత గా చేసిన (తనికెళ్ల భరణి)కు అందిస్తుంటాడు. ఒకరోజు ఓ క్రేజీ దర్శకుడు (రాజీవ్ కనకాల) నుండి సినిమా చేస్తానని నిర్మాత (తనికెళ్ల భరణి)కి డేట్స్ ఇవ్వడంతో ఆ సినిమాకి కథలు అందించే దిశగా సరికొత్త కథలను అన్వేషిస్తు, కొత్తకొత్త ఆలోచనల కోసం తన భార్య (షెర్రీ అగర్వాల్), పిల్లలతో కలిసి విహార యాత్రకు బయలుదేరాతాడు. అలా వెళ్తున్న తన ప్రయాణంలో తన కారు ట్రబుల్ ఇవ్వడంతో అక్కడే ఉన్న ఓ పోలీస్‌ఆఫీసర్ (అజయ్) సహాయంతో అనుకోకుండా ఆ రోజు రాత్రి అక్కడే ఓ అతిథిగృహంలో ఉండాల్సి వస్తుంది. ఆ రాత్రి విహారికి అక్కడ ఎదురైన ఊహించని పరిణామలేమిటి? దర్శకుడు మెచ్చిన కథను తను తయారు చేశాడా లేదా? అనే ఆసక్తికరమైన కథనంతో మిగత కథ అనేది కొనసాగుతుంది.

కథ విశ్లేషణ : తను రాసుకున్న సరికొత్త పాయింట్‌తో దర్శకుడు వీరాస్వామి చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాల్లోని ట్విస్ట్లు, క్లైమ్యాక్స్ సన్నివేశాలు అనేవి ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లింగ్ గా అనిపించాయి. సినిమా సాగుతున్న కొద్ది ప్రేక్షకుడు కూడా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా సినిమా కొనసాగుతుంది. క్లైమ్యాక్స్ సన్నివేశాలు ఆడియన్స్ కు ఓ సరికొత్త అనుభూతిని కలిగేలాచేస్తాయి. వీరాస్వామి, హరిప్రసాద్ జక్కా ఊహకందని మలుపులతో స్క్రీన్‌ప్లే దిశగా సినిమాను తీర్చిదిద్దారు. సందీప్‌కుమార్ నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఉన్నాయి.

నటి నటుల పెర్ఫార్మెన్స్ : సినిమాలో హీరోగా చేసిన రంజింత్‌కు ఇది తొలి చిత్రమైనప్పటికి కూడా తన పాత్ర మేరా చాలా సహజంగా నటించాడు. విహారి పాత్రలో కొన్ని సన్నివేశాలలోమంచి నటననుకనబరిచాడు. సీనియర్ నటి నటులు తనికెళ్ల భరణి, అజయ్‌, రాజీవ్ కనకాల సినిమాకి కావాల్సిన ఎమోషనల్ ఫీల్ ను క్యారి చేసేలా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. కామెడి టైమింగ్ పరంగా జబర్దస్త్ ఫేం చమ్మక్ చంద్ర తనదైన శైలి వినోదంతో ఆడియన్స్ను నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులను ఈ సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలు థ్రిల్ల్ ను అలిగించేఅంశాలు కథకు అనుగుణంగసాగాయి. సినిమాలో ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ సంభాషణలకు చోటు ఇవ్వకుండా ఎటువంటి అశ్లీల సన్నివేశాలు లేకుండా అన్ని వర్గాలవారు చూడదగ్గ సినిమాగా రూపొందింది.

రేటింగ్: 2.25/5

Leave a comment

error: Content is protected !!