Anushka Shetty : అందాల అనుష్క శెట్టి తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఆమె నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భాగమతి’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి సరికొత్త అప్డేట్ వచ్చింది. దర్శకుడు అశోక్ తాజా ఇంటర్వ్యూలో ‘భాగమతి 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని ఆయన వెల్లడించారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితవుతుంది. షూటింగ్ 2025 ప్రారంభంలో ప్రారంభం కానుంది. అనుష్క శెట్టి సినిమాకు ఒప్పుకొన్నప్పటికీ, కథ ఇంకా ఫైనల్ కాలేదని, స్క్రిప్ట్ నచ్చితేనే ఆమె షూటింగ్‌కు డేట్స్ కేటాయించనున్నారని సమాచారం. ‘భాగమతి 2’ కూడా అనుష్క కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!