సాధారణంగా అందమైన అమ్మాయిల్లో అహంకారమే హైలైట్ అవుతూంటుంది. అందరికీ అది వర్తించకపోయినా.. ఎక్కువ శాతం మగువలకు అది అలంకారం గా  ఉండిపోతుంది. డీఫాల్ట్ గా ఈ లక్షణం గల కథానాయికలు ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఇందులో స్వీటీ అనుష్కకి మినాహాయింపునివ్వాల్సిందే. అమ్మడికి అందంతో పాటు అందమైన మనసు కూడా ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆమె ఎంతటి దయార్ధ్ర హృదయురాలో, ఆమె లో మానవత్వం ఏ స్థాయిలో ఉందో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు.

తాను ఐదారు నెలల క్రితం జార్జియాకు వెళ్లినట్లు చెప్పిన ఆయన.. అక్కడ కారు డ్రైవర్ కమ్ కేర్ టేకర్ గా వ్యవహరించే జాజా.. మీకు స్వీటీ తెలుసా? అని ప్రశ్నించటం తో తాను షాక్ తిన్నట్లు చెప్పారు. ఒక పని మీద తానా దేశానికి వెళ్లినప్పుడు తనకు జాజా అనే కారు డ్రైవర్ కలిశాడని.. అతగాడు స్వీటీ గురించి అడిగి.. ఆమె తనకు చేసిన సాయం గురించి చెప్పుకున్నాడని చెప్పారు. తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు జార్జియాకు వెళ్లిన స్వీటీకి.. కారు డ్రైవర్ గా.. కేర్ టేకర్ గా వ్యవహరించిన జాజా కారును ఫైనాన్స్ వారు తీసుకెళ్లిపోతే.. అనుష్క అతడికి కొత్త కారు కొనిచ్చిన వైనాన్ని తనకు చెప్పారంటూ కొత్త విషయాన్ని రివీల్ చేశారు. ఏమైనా అందాల బొమ్మ అనుష్కలో ఇంత అందమైన మనసు ఉందన్న విషయం తెలిసినప్పుడు ఆమె మీద మర్యాద.. గౌరవం మరింత పెరగటం ఖాయం.

Leave a comment

error: Content is protected !!