క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పాన్-ఇండియా మూవీ. యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. వేదం బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అనుష్క,క్రిష్‌ల కలయికలో వస్తున్న రెండవ చిత్రం ఘాటి, ఇది UV క్రియేషన్స్‌తో కలిసి అనుష్క నాల్గవ సినిమా. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
