చక్రాల్లాంటి కళ్ళు.. చలాకీ చూపు.. మెరుపులాంటి నవ్వు.. మైమరిపించే సోయగం .. వీటికి తోడు.. మెస్మరేజ్ చేసే నటన. కలగలిస్తే అనుష్క శర్మ.  బాలీవుడ్ లో అమ్మడు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్  పెర్ఫార్మర్. అందాన్ని, అభినయాన్ని బేలెన్స్ చేస్తూ ఆమె పోషించే ప్రతీ పాత్ర అద్భుతం. ఆమె అభినయించే తీరు అద్వితీయం. రబ్ నే బనాది జోడీతో బాలీవుడ్ వెండితెరమీద తళుక్కున మెరిసిన ఆ తార తొలి చిత్రంతోనే షారుఖ్ లాంటి సూపర్ స్టార్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. మోడలింగ్ నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ సుందరి..  బాలీవుడ్ నే శాసిస్తూ.. అనితర సాధ్యమైన నటననే శ్వాసిస్తోంది.

బెంగు‌ళూరు నుంచి ముంబైకి మకాం మార్చాక అనుష్క శర్మకి మోడ‌ల్‌గా మరింత పేరొ‌చ్చింది. యేడాది కాలం‌లోనే నెంబ‌ర్‌వన్‌ మోడ‌ల్‌గా గుర్తింపు తెచ్చుకొంది. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరుపులు మెరి‌పిం‌చింది. పలు అంత‌ర్జా‌తీయ స్థాయి ఉత్ప‌త్తు‌లకు బ్రాండ్‌ అంబా‌సి‌డ‌ర్‌గా ఎంపి‌కైంది. అప్పుడే యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ దృష్టిలో పడటం, వాళ్లు మూడు సిని‌మా‌లకి అను‌ష్కతో ఒప్పందం కుదుర్చు‌కో‌వడం చక‌చకా జరి‌గి‌పో‌యాయి. ఒప్పందం మేరకు ఆ సంస్థలు ‘రబ్‌ నే బనాది జోడి’, ‘బద్మాష్‌ కంపెనీ’, ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ చిత్రాల్లో నటిం‌చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వసూళ్ల కథానాయిక ఎవరు అని ప్రశ్నిస్తే.. పెద్దగా ఆలోచించకుండా అందరి నుంచి వచ్చే సమాధానమొక్కటే అనుష్క శర్మ. ఆమీర్‌ ఖాన్‌తో చేసిన ‘పికె’, సల్మాన్‌ ఖాన్‌తో చేసిన ‘సుల్తాన్‌’ చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ఈ రెండు సినిమాలు రూ.500 కోట్ల మార్కును దాటేశాయి. దీని తర్వాత ఆమె చేసిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా రూ.200 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఓవైపు నటిగా రాణిస్తూనే సినిమా నిర్మాతగా మారిన అనుష్క అందులోనూ తొలి అడుగులోనే మంచి విజయాన్ని అందుకొంది. ఆమె నటిస్తూ, నిర్మించిన ‘పిల్హౌరీ’ రూ.20కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ‘పరీ’ చిత్రం తోనూ నటిగా, నిర్మాతగా చక్కటి విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది అనుష్క శర్మ. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని గృహిణి గా మారిన  అనుష్క శర్మ పుట్టినరోజు నేడు . ఈ సందర్భంగా ఆ అందాల అభినేత్రికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే అనుష్క .

 

Leave a comment

error: Content is protected !!