ఏదివిలో విరిసిన పారిజాతమో.. దివి నుంచి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాత పువ్వై నీవు..  ఏ స్వప్న లోకాల సౌంద్యరాశి నాముందుకొచ్చింది కనువిందు చేసి… లాంటి పాటలు బహుశా ఆమె లాంటి మెరుపుతీగల వల్లే పుట్టి ఉంటాయి. లేకపోతే.. 15 ఏళ్ళు గా ఆ అందం చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఎందుకుంటుంది? అనుష్క శెట్టి లాంటి స్వీటీని చూస్తే ఆ విషయం నిజమే అనిపిస్తుంది. అవును మరి ఆమె అందం అలాంటింది. పాలరాతి మేనితో .. వన్నెతరగని ఛాయతో ఇప్పటికీ అలాగే ఉంది అనుష్క. ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పుడే 15 ఏళ్ళు అయిపోయింది.

మంగుళూరులో పుట్టిన అనుష్క స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్  అంతా బెంగుళూరులోనే జరిగింది. అమ్మడి  మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కాలేజ్ నుండి బి.సి.ఏ గ్రాడ్యుయేషన్ పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్. కింగ్ నాగార్జున అనుష్కను సూపర్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత  మహానంది విజయం కూడా అనుష్కకు బాగా హెల్పయింది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి, జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనే తనలోని నటిని ఆవిష్కరించింది. ఆ సినిమా నుంచి ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరయింది. ఇక బాహుబలి చిత్రంలో ఆమె చేసిన దేవసేన పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. ఆ సినిమా అమ్మడికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నిశ్శబ్దం లనే మూవీలో మూగ, బధిర పాత్ర పోషిస్తోంది. అనుష్క టాలీవుడ్ లో 15 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!