సాయి ధన్సిక, అమిత్ తివారి, గణేశ్ వెంకట్రామన్  నటించిన “అంతిమ తీర్పు” చిత్రం జూన్ 21న విడుదల కానుంది. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై డి. రాజేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి ఏ. అభిరాం దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో సాయి ధన్సిక ఒక గృహిణి పాత్రలో నటించింది. మిస్టరీ, థ్రిల్ కి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కోటి అందించిన సంగీతం మరో హైలెట్.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగిన చిత్రంగా నిర్మాత డి.రాజేశ్వరరావు అన్నారు. సాయి ధన్సిక నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందని ఆయన నమ్ముతున్నారు.

Leave a comment

error: Content is protected !!