అక్కినేని నాగేశ్వరరావు తన నటజీవితంలో ఎన్నో ఉదాత్తమైన పాత్రలతో నిండిన  సినిమాల్లో నటించారు. వాటిలో ‘ధర్మదాత’ ఒకటి.  రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై తమ్మారెడ్డి కృష్ణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు అక్కినేని సంజీవి. అక్కినేని తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో కాంచన కథానాయికగా నటించగా… నాగభూషణం, రేలంగి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, సాక్షిరంగారావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టి.చలపతిరావు సంగీతం అందించగా..  ఎవ్వరికోసం ఎవరుంటారు , ఓ నాన్నా నీ మనసే వెన్న , ఓ ధర్మదాత లాంటి పాటలు ఎంతగానో మెప్పిస్తాయి.

దాన ధర్మాలతో, సత్కార్యాలతో  ధర్మదాతగా పేరు తెచ్చుకుంటాడు  జమీందార్ రాజా రఘుపతిరావు. అయితే అతడి కీర్తి ప్రతిష్టలపై కన్నుకుట్టిన భూజంగరావు ..తన కొడుకుకి , రఘుపతిరావు కూతురికి పెళ్ళి జరిపించి.. ఆయన ఆస్తినంతటినీ లాగేసుకుంటాడు. దాంతో రాజా రఘుపతిరావు .. భుజంగరావు తో తన ఆస్తిని తాను దక్కించుకుంటానని ఛాలెంజ్ చేసి.. తన కొడుకులతో దాన్ని నెరవేర్చుకోవడమే సినిమా  కథ. నిజానికి ఈ సినిమా శివాజీ గణేశన్ నటించిన సూపర్ హిట్టు తమిళ చిత్రం ‘ఎంగవూర్ రాజా’ కి రీమేక్ వెర్షన్. 

Leave a comment

error: Content is protected !!