Puja Hegde : సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక పూజా హెగ్డే. ఆమె త్వరలోనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించనుంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రంలో ప్రారంభంలో శ్రీలీలను ఒక కీలక పాత్రలో నటింపజేయాలని భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ పాత్రకు తగిన నటిని వెతుకుతూ చిత్రబృందం ప్రయత్నాలు చేసింది. చివరకు, ఈ పాత్రకు పూజా హెగ్డేనే ఆ పాత్రకు యాప్ట్ అని నిర్ణయించారు. ప్రస్తుతం పూజా హెగ్డేతో ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి.
ఈ రొమాంటిక్ ప్రేమకథకు ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ‘దేవా’ మరియు ‘సూర్య44’ వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈ తరుణంలో ఈ కొత్త చిత్రం ఆమె బిజీ షెడ్యూల్‌కు అదనంగా వచ్చి చేరింది.