Swag movie : యూత్ స్టార్ శ్రీవిష్ణు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించిన అతడు, తదుపరి “స్వాగ్” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే అనేక ఆసక్తికరమైన అప్డేట్స్ తో వార్తల్లో నిలిచిన ఈ సినిమా లో మరో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ దక్షా నగార్కర్ నటించనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో దక్షా నగార్కర్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే మీరా జాస్మిన్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది. శ్రీవిష్ణు కెరీర్ లోనే ఒక విభిన్నమైన సినిమాగా “స్వాగ్” ను ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 

Leave a comment

error: Content is protected !!