Mollywood: మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ రీసెంట్ గా “ది గోట్ లైఫ్” సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నాడు. లేటెస్ట్ గా “గురువాయూర్ అంబలనడయిల్” చిత్రంతో కూడా సాలిడ్ హిట్ అందుకున్నాడు. వీటిలో ఒకటి సర్వైవల్ థ్రిల్లర్ అవగా.. రెండోది ఫన్ ఎంటర్‌టైనర్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన “గురువాయూర్ అంబలనడయిల్” అన్ని అంచనాలను మించిపోయింది. ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయో కలెక్షన్స్ రాబడుతోంది.
“జయ జయ జయ జయ హే” ఫేమ్ విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ కామెడ డ్రామా ఇప్పటికే వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల మార్కును దాటిపోయింది. ఈ సినిమా మొదటి సోమవారం రోజున 3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది, ఇప్పటి వరకు కేరళలో 20 కోట్లకు పైగా వసూలు చేసింది. “గురువాయూర్ అంబలనడయిల్” అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అద్భుతంగా నడుస్తోంది. ఇది మలయాళ చలన చిత్ర పరిశ్రమకు మరో 100 కోట్ల గ్రాసర్‌గా నిలవవచ్చని అంచనా వేస్తున్నారు.
మమ్ముట్టి “టర్బో” థియేట్రికల్ రిలీజ్ స్క్రీన్ కౌంట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుండి లభించిన సానుకూల స్పందనను బట్టి, “గురువాయూర్ అంబలనడయిల్” కు 100 కోట్ల గ్రాసింగ్ సాధించడం కష్టం కాదు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ మరియు E4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లలో నిర్మించిన ఈ చిత్రంలో బెసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వరా రాజన్, సైజు సన్నీ, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.