సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్ గా, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వాసుకి, రావు రమేష్, నరేష్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతా రామం వంటి క్లాసికల్ హిట్‌ లను అందించిన స్వప్న సినిమాస్ & మిత్ర విందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రానున్న, ఈ చిత్రానికి ‘నందిని రెడ్డి’ దర్శకురాలు. ఇప్పటికే విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

వేసవిలో మన ‘అమ్మమ్మ’ ఇంటికి వెళ్తే వచ్చే ఆనందంతో పాటు, రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ‘అన్నీ మంచి శకునములే’. కాస్టింగ్ విషయంలో స్వప్న, ప్రియాంక ఇద్దరు ఎంతో శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తుంది. ప్రొడ్యూజర్ ‘స్వప్న’ మరియు పవన్ కళ్యాణ్ సిస్టర్ గా నటించిన ‘వాసుకి’ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కావడం, ఆ చనువుతో సినిమా ఓప్పుకోవడం. అలాగే ‘షావుకారు జానకి’ మరియు సీనియర్ నటి ‘గౌతమి’ ని తీసుకోవడం ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అనే చెప్పాలి. ‘మిక్కీ జే మేయర్’ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ‘టైటిల్ ట్రాక్’ లాంచింగ్ ‘ఉగాది’ పండగ నాడు గ్రాండ్ గా నిర్వహించారు. అర్థవంతమైన సాహిత్యంతో, మెస్మరైజింగ్ వాయిస్ తో ప్లజంట్ వైబ్ కలిగిస్తుంది. ఈ పాటని ‘కార్తీక్’ పాడగా, ‘రెహమాన్’ సాహిత్యం అందించారు.

ఒక పక్క ఇండియా ‘రెబల్ స్టార్ ప్రభాస్’ తో భారీ బడ్జెట్ లు చేస్తూనే, చిన్న బడ్జెట్లతో ప్రేక్షకులని ఆకట్టుకుకోవడంలో ‘దత్’ గారి ఫ్యామిలీ కి బాగా వంట పట్టినట్టుంది. స్వప్న సినిమా బ్యానర్ పై మొదటి సినిమాగా ‘స్టూడెంట్ నెం 1’ చేసి, కొంత గ్యాప్ తర్వాత స్వప్న, ప్రియాంక బ్యానర్ బాధ్యతలు తీసుకున్నారు. స్వప్న సినిమా బ్యానర్ నుంచి ఇండస్ట్రీ కి పరిచయం అయ్యిన ‘మాళవిక నాయర్’ ఇందులో హీరోయిన్. వరుస ఫ్లాప్స్ తో సతమవ్వుతున్న హీరో ‘సంతోష్ శోభన్’ ని ఈ సినిమాలో పెట్టుకోవడం విశేషం. మరి, ఈ సినిమాతో నైన హిట్ వరిస్తుందో లేదో చూడాలి. మంచి కథ, సంగీతం తో ఎంతో హాయిగా సాగే సినిమా ‘అన్నీ మంచి శకునములే’ అని ‘దత్’ ఫ్యామిలీ చెప్తున్నారు. సమ్మర్ లో రానున్న ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూద్దాం.

తారాగణం: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: బివి నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
బ్యానర్లు: స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: సన్నీ కూరపాటి
డైలాగ్ రైటర్: లక్ష్మీ భూపాల
కాస్ట్యూమ్ స్టైలిస్ట్: పల్లవి సింగ్
స్క్రీన్ ప్లే రైటర్: దావూద్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు
పీఆర్వో: వంశీ శేఖర్

Leave a comment

error: Content is protected !!