Bahishkarana : యాబైకి పైగా సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అంజలి. తాజాగా ఆమె బహిష్కరణ” అనే వెబ్ సిరీస్ లో నటించనున్నారు. ఈ సిరీస్ జీ 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్లపై రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్.. విలేజ్ రివెంజ్ డ్రామా థీమ్ తో రూపొందుతోంది. అంజలి, ఒక గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది. అంజలి పుట్టినరోజు సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. అంజలి చేతిలో వేట కొడవలి పట్టుకుని కోపంగా కూర్చుంది.. ఆమె పక్కన్న ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. అంజలితో పాటు ఈ సిరీస్ లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితర నటులు నటిస్తున్నారు. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తున్న ఈ సిరీస్ కు, ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

Leave a comment

error: Content is protected !!