Anjali : ఇటీవలే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో 50 చిత్రాల మైలురాయిని దాటిన నటి అంజలి. ఇప్పుడు విష్వక్ సేన్ తో కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా, ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమాలో అంజలి పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని, ట్రైలర్ లో ఆమె డైలాగ్ లు, యాక్షన్ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో అంజలి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది .
“ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్రలో నేను నటించడం ఇదే మొదటిసారి. డైలాగ్ లు కూడా చాలా బోల్డ్ గా ఉన్నాయి. మొదటిసారి ఆ డైలాగ్ లు విన్నప్పుడు నిజంగా వీటిని సినిమాలో ఉంచుతారా అని అనుకున్నాను. కానీ ఈ పాత్ర నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడానికి ఇష్టపడను. వీలైనంత వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటాను. “ఈ సినిమాలో నా పాత్ర పేరు రత్నమాల. విష్వక్ సేన్ పాత్ర పేరు రత్నాకర్. మా ఇద్దరి పాత్రల మధ్య ఉన్న బంధం చాలా స్వీట్ గా ఉంటుంది. సినిమాలో మా పాత్రలు పోటీపడుతున్నట్లు కూడా అనిపిస్తుంది. ఈ పాత్రను చేయడం నాకు చాలా సవాల్ గా అనిపించింది. కానీ చాలా ఆనందించాను.” అని చెప్పింది.