Bahishkarana webseries : యాబైకి పైగా చిత్రాలలో నటించి, వెరైటీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన తెలుగు అమ్మాయి అంజలి, ఇప్పుడు మరోసారి ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. జీ5 అండ్ పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్‌లపై రూపొందుతోన్న “బహిష్కరణ” అనే వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఇదొక విలేజ్ రివెంజ్ డ్రామా. దీనిని ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్లు ఉంటాయి. జూలై 19 నుండి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ చాలా ఆకట్టుకుంటుంది. ఒక ప్రశాంతమైన పల్లెటూరికి వచ్చిన ఒక యువతి, ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు, ఆమె ప్రతీకార దాహం గురించి టీజర్‌లో చిత్రీకరించారు.

అంజలి నటన చాలా బలంగా ఉంది, ఆమె పాత్రలోని భావోద్వేగాలను చాలా బాగా పోషించింది. ఈ టీజర్ ప్రేక్షకులలో మంచి అంచనాలను కలిగించింది. “బహిష్కరణ” అంజలి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!