తన చెప్పిన స్టోరీ హీరోని ఇంప్రెస్ చేయాలని ఎలాంటి డైరెక్టర్ అయినా కోరుకుంటాడు. అయితే తనకు నచ్చడమే కాకుండా.. అంతకు మించే అనే రేంజ్ లో హీరో.. ఆ పాత్ర లో ఇన్వాల్వ్ అయి నటిస్తే .. ఆ డైరెక్టర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ని అడిగితే తెలుస్తుంది. ఈ విషయంలో రణబీర్ కపూర్ ఒక అద్భుతం అంటున్నాడు సందీప్ రెడ్డి. ఆయన కంటే తను ఏడాది చిన్న అని, లేదంటే ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి కాళ్ళు మొక్కాలి. ఆయనతో వర్క్ చేయడం మజా వచ్చింది. ఆయనకి వున్న ఓపిక మరెవరికీ లేదు. అంటూ సందీప్ రెడ్డి .. రణబీర్ కపూర్ ను తెగ ఆకాశానికి ఎత్తేశాడు. యానిమల్ మూవీ గానీ .. అర్జున్ రెడ్డిలాగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తే .. రణబీర్ కపూర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరుగుతుందని వేరే చెప్పాలా?

Leave a comment

error: Content is protected !!