అనిల్ రావిపూడి తొలి సినిమా ‘పటాస్’ తోనే మంచి విజయం సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు మొదటగా కొన్ని సినిమాలకి రైటర్ గా కూడా పని చేశాడు. అలా చేసిన వాటిలో మాస్ మహారాజ్ రవితేజ ‘దరువు’ విక్టరి వెంకటేష్ ‘మసాలా’ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తను దర్శకుడిగా మారిన తర్వాత రవితేజతో ‘రాజా ది గ్రేట్’ వెంకటేష్ తో ‘ఎఫ్2’ మరియు మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో ఆ హీరోలకు హిట్ సినిమాలను అందించడం విశేషం. అనిల్ ప్రస్తుంతం ఎఫ్2 సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్3’ సినిమాను తెరకెకిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

Leave a comment

error: Content is protected !!