సౌత్ ప్రేక్షకులకు అందాల ఆండ్రియా జెర్మియా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘యుగానికొక్కడు’ చిత్రంతో సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయిన ఆమె ..  టాలీవుడ్ లోనూ  ‘తడాఖా, గృహం’ లాంటి చిత్రాలతో సుపరిచితమే. అయితే ఈ అమ్మడు ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇప్పుడు ఇతర హీరోయిన్ప్ లా .. ఇంటిపనులు లాంటివేమీ పెట్టుకోకుండా.. అమ్మడు ఏకంగా ఒక షార్ట్ ఫిల్మ్ లోనే నటించేసింది. మూడు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో చూపించారట.

ఈ షార్ట్ ఫిల్మ్ కి రచన దర్శకత్వం ఆధవ్ కన్నదాసన్. కేవలం వీడియో కాల్స్ ద్వారా అతను డైరెక్ట్ చేశాడట. అయితే షూట్ చేసింది మాత్రం వేరే వ్యక్తి.. ఆండ్రియా ఇంటికి దగ్గరలో ఉండే సినిమాటోగ్రాఫర్ నితిన్ రామ్ షూట్ చేసాడట. షూటింగ్ చేసేటప్పుడు భౌతిక దూరం పాటించారట. ఇప్పటికే తెలుగులో ఈ విధమైన షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున వరుణ్ తేజ్ సాయి తేజ్ నటించిన కరోనా పాటను ఎవరి ఇంట్లో వారు ఉంటూ ఫోనులోనే షూట్ చేశారు. అమితాబ్ బచ్చన్ చిరంజీవి మోహన్ లాల్ తదితరులు ఇదే విధంగా ఒక షార్ట్ ఫిలిం చేశారు. తెలుగులో టీవీ తారలు కూడా మరో షార్ట్ ఫిలిం చేశారు. ఈ బాటలో ఇంకెంత మంది చేరతారో చూడాలి. శివ సౌండ్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ డిజిటల్ గానే విడుదల కానున్నట్టు సమాచారం. ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!