ఆమె పదహారణాల తెలుగమ్మాయి. అందానికి ,అభినయానికి కేరాఫ్ అడ్రెస్. అందమైన చిరునవ్వుకి,  అంతకన్నా అద్భుతమైన పాత్రలకు ఆమె  పెట్టింది పేరు. ఆమె పేరు రీతూ వర్మ. నాటి ‘పెళ్ళి చూపులు’ చిత్రం నుంచి నేటి ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం వరకూ ఆమె నటించిన చిత్రాలను చూస్తే.. ఆమె ఎంతటి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుందో అర్ధమవుతోంది.

పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అనేది ఒట్టి సామెత మాత్రమేనని తాను తెలుగమ్మాయిని అయినప్పటికీ.. తెలుగు, తమిళ దర్శక, నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నని చాటిచెబుతోంది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా  అందాల బొమ్మ రీతూ వర్మకి  శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే రీతూ వర్మ

Leave a comment

error: Content is protected !!