బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం‘ పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో లారీ డ్రైవర్ గా బన్నీ నటిస్తోన్న ఈ మూవీ.. చిత్తూరు అడవుల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోనుంది.  ఈ సినిమాలోని తన పాత్ర కోసం బన్నీ ఏకంగా చిత్తూరు యాస్ నేర్చుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ టాలీవుడ్ లో ఆసక్తి గా మారింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఒక అక్క పాత్ర ఉందట. సినిమా కథను కీలకమైన మలుపు తిప్పే ఆ పాత్ర కోసం స్టార్ యాంకర్ సుమ ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా ఇందులో  పుష్ప కి అక్కగా యాంకర్ అనసూయ నటిస్తోందని వార్తలు వచ్చాయి. ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా మంచి నటన కనబరిచిన అనసూయ అయితే ఆ పాత్రకి న్యాయం చేస్తుందని సుకుమార్ భావించాడని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు యాంకర్ సుమ ఈ క్యారెక్టర్ ప్లే చేస్తోందని తాజా సమాచారం . సిల్వర్ స్క్రీన్ పై తన మాటలతో స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  ‘పవిత్ర ప్రేమ’ ‘వర్షం’ ‘చాలా బాగుంది’ ‘కలిసి నడుద్దాం’ ‘బాద్షా’ ‘ఓ బేబీ’ లాంటి చిత్రాల్లో నటించింది. మరి ‘పుష్ప’ పాత్ర ధారి అల్లు అర్జున్ కి అక్కగా సుమ ఏ రేంజ్ లో నటించి మెప్పిస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!