మూవీ: దర్జా
నటి నటులు: అనసూయ, సునీల్, ఆఖ్సా ఖాన్, శమ్ము, శిరీషా నూలు, అరుణ్ వర్మ, ఆమని, రవి పైడిపాటి, పృథ్వి రాజ్, షఫీ, జబర్దస్త్ నాగిరెడ్డి
డైరెక్టర్: సలీం మాలిక్
నిర్మాత: శివ శంకర్ పైడిపాటి
బ్యానర్: పి. ఎస్. ఎస్. ఎంటర్టైన్మెంట్స్ & కామినేని శ్రీనివాస్ ప్రెజెంట్స్
మ్యూజిక్ డైరెక్టర్: ర్యాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రాఫర్: దర్శన్
ఎడిటర్: వర్మ
మూవీ రీలిజ్: జులై 22-2022

అనసూయ, సునీల్, ఆఖ్సా ఖాన్ ప్రధాన పాత్రలు గా తెరకెక్కిన చిత్రం “దర్జా”. పి.ఎస్.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా కామినేని శ్రీనివాస్ ప్రెజెంట్స్ లో రీలిజ్ అయ్యిన ఈ సినిమా కి “సలీం మాలిక్” దర్శకత్వం వహించారు. ఇప్పటికే “అక్సా ఖాన్” చేసిన వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో వైరల్ అవ్వగా, ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ లో అనసూయ యాక్ట్ చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వారం థియేటర్ లో రీలిజ్ అయ్యిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం?

కథ: కనకమహాలక్ష్మి(అనసూయ) తన అనుచరులతో కలిసి సారా దందా తో పాటు కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తుంటుంది. ఇవ్వన్నీ తెలుసుకున్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎస్ ఐ (రవి పైడిపాటి) కనకమహాలక్ష్మి కి ఎదురు తిరగడంతో అతి కిరాతకంగా చంపేస్తుంది. అరుణ్ వర్మ(మూగవాడు) & పుష్పా(శిరీషా) ఇద్దరు ప్రేమించుకొని ఊరి వదిలి పారిపోతుండగా, కనకమహాలక్ష్మి(అనసూయ) తమ్ముడు “బళ్లారి”, అరుణ్ వర్మ(మూగవాడు) ని చంపి పుష్పా ని ఎత్తుకెళ్లిపోతాడు. తన అన్నయ్య ని చంపినా తమ్ముడు “శమ్ము”(రంగా) బళ్లారి & కనకమహాలక్ష్మి మీద పగా ఎలా తీర్చుకున్నాడు? పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన సునీల్ ఆ కేస్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కధ?

కథనం, విశ్లేషణ: ఫస్ట్ ఆఫ్ మొదట్లోనే అనసూయ ఇంట్రడక్షన్ అరాచకం గా ఉంటుంది. అనసూయ కెరీర్ లో ఈ సినిమా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కొత్త వాడైనా రవి పైడిపల్లి (ఎస్ ఐ) రోల్ లో బాగా రాణించాడు. శమ్ము, అరుణ్ వర్మ అన్న దమ్ముల అనుబంధం అలాగే ఆమని తో సాగే ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అరుణ్ వర్మ(మూగవాడు) క్యారెక్టర్ లో ఒదిగిపొయ్యి నిజంగానే మూగవాడేమో అనిపించేలా జీవించాడు.అరుణ్ వర్మ(మూగవాడు) ఊరి వదిలి పారిపొయ్యేటప్పుడు పుష్పా(శిరీషా) కి “ఐ లవ్ యు” చెప్పడానికి ట్రై చేస్తున్న సీన్ స్క్రీన్ మీద ఆకట్టుకుంటుంది. ఇకపోతే, అక్సా ఖాన్  స్క్రీన్ మీద ఉన్నంత వరుకు ఎక్సలెంట్ గా పెర్ఫామెన్స్ తో రాణించింది. ఎస్పీషియల్లి “లింగో లింగో” సాంగ్ లో చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. పుష్పా క్యారెక్టర్ లో శిరీషా చాలా పద్ధతి గల అమ్మాయిగా రాణించడంతో పాటు, విలన్ పతనానికి బీజం వేస్తుంది శిరీషా. సినిమాలో ప్రేమ, అనుబంధాలు గురించి చెప్పడానికి బాగా ట్రై చేసిన ఎమోషనల్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోలేక పోవటం. అదే విధంగా కామిడి కి స్కోప్ ఉన్న ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఇలాంటివి మైనస్ అని చెప్పాలి.

నటి నటులు పెర్ఫామెన్స్: ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రెడిట్ మొత్తం “అనసూయ” తన ఖాతాలో వేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే, అంతలా తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. పోలీస్ పాత్రలో సునీల్ పవర్ ఫుల్ గా కనిపించి మెప్పించారు. ఢీ 10 ఫేం “అక్సా ఖాన్” తన డైన యాక్టింగ్ తో పాటు, స్టెప్స్ తో అలరించిన ఆఖ్సా ఖాన్ ఆల్ రౌండర్ పెర్ఫామెన్స్ తో సినిమా కే ఒక అస్సెట్ అని చెప్పాలి. “ఆమని” ఉన్నంత సేపు చాలా ఎమోషనల్ గా  కనెక్ట్ అవుతారు. కొత్త వాళ్లైనా “శమ్ము”, అలాగే “అరుణ్ వర్మ”(మూగవాడు) క్యారెక్టర్ లో బాగా జీవించాడు. షకలక శంకర్, పృథ్వి రాజ్ వీళ్ళద్దిరి తమ కామిడి తో ఆకట్టుకున్న ఇంకొంచెం స్క్రీన్ స్పెస్ ఇచ్చి ఇంకా, కామెడి కి అవకాశం ఇచ్చి ఉంటె బాగుండేది. తదితర నటి నటులు అందరూ బాగానే రాణించారు.

సాంకేతిక వర్గం: ఒక అన్న- దమ్ములు, అక్క-చెల్లెళ్లు అలాగే అక్కా-తమ్ముళ్లు మధ్య జరిగే కథ ని బాగా రాసుకోవడంతో పాటు, కథ కి తగ్గట్టు ఆర్టిస్ట్ లని ఎంచుకోవడంలో కూడా డైరెక్టర్ సలీమ్ మాలిక్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ, సినిమాలో వచ్చే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఇంకా బాగా డీల్ చేసి ఉంటె బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్, ఎడిటర్ వర్మ పని తీరు పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ దర్శన్ అక్కడక్కడ మిస్ ఫైర్ అయ్యిన ఓవర్ ఆల్ గా బాగానే రాణించారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగానే ఖర్చుపెట్టారు.

బాటమ్ లైన్:  ఎమోషన్స్ తో సాగే  “దర్జా”

రేటింగ్:  3/5

Leave a comment

error: Content is protected !!