Ananyapandey : అనన్య పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న వెరైటీ బాలీవుడ్ చిత్రం ‘కంట్రోల్’. ఈ సినిమా ట్రైలర్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రం కృత్రిమ మేధ (ఏఐ), సోషల్‌ మీడియా వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో సాగుతూ, మన జీవితాలను నియంత్రించే శక్తి ఎవరి చేతిలో ఉందనే ప్రశ్నను లేవనెత్తుతుంది.

ట్రైలర్‌లో, అవస్థి పాత్రధారి అనన్య .. తన సమస్యలను పరిష్కరించాలనే ఆశతో ఏఐతో సంభాషిస్తుంది. “నా బాయ్‌ఫ్రెండ్‌ను నా జీవితం నుంచి తీసేయాలనుకుంటున్నాను. ఆ పనిని నువ్వు చేయగలవా?” అని ఏఐని అడుగుతుంది. ఈ సన్నివేశం, ఆధునిక సమాజంలో మనం తీసుకునే నిర్ణయాలపై సాంకేతికత ఎంతవరకు ప్రభావం చూపుతుందనే ప్రశ్నకు అద్దం పడుతుంది.

‘కంట్రోల్’ సినిమా, ఏఐతో పరిచయం పెంచుకున్న అవస్థి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందనేది చూపిస్తూ, సైబర్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రం, మన జీవితాలు ఈ డిజిటల్‌ ప్రపంచం నియంత్రణలో ఉన్నాయా లేదా మనమే వాటిని నియంత్రిస్తున్నామా అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులను ప్రోత్సహిస్తుంది. నిఖిల్‌ ద్వివేది నిర్మించిన ఈ చిత్రం, విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. విహాన్‌ సమత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం వచ్చే నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!