హైదరాబాద్‌లోని ఇన్‌ఓర్బిట్ మాల్‌లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్‌కు మరింత ఆకర్షణను జోడించారు. గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్‌ను బయటకు తీయాలి. ఈ ఈవెంట్‌లో పాల్గొన్నవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించి, ఉత్సాహంగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షణీయమైన బహుమానాలు లేదా ఇతర ప్రత్యేక బహుమతులు అందుకున్నారు.

అనన్య నాగళ్ల మాట్లాడుతూ, “ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ చాలా ఉత్తేజకరంగా ఉంది. పాల్గొనేవారి ఉత్సాహం, నైపుణ్యం చూసి ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక, వినోదాన్ని కూడా అందిస్తాయి,” అని అన్నారు.

ఇన్‌ఓర్బిట్ మాల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, ఉత్సవ వాతావరణంలో పాల్గొన్నారు. వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ హైదరాబాద్‌లో వినోదం, ఉత్సాహం నిండిన ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచింది

Leave a comment

error: Content is protected !!