Gamgam Ganesha trailer : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన సొంత టాలెంట్ తోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మొదటి సినిమా “దొరసాని”తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న అతడు , ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మరింత పరిణతి చెందాడు. ఇటీవలే “బేబీ” సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆనంద్, ఇప్పుడు “గం గం గణేశా” అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు అనే ముద్ర వేసుకోకుండా, తన సొంత ప్రతిభతోనే నిలబడాలని ఆనంద్ ఈ సినిమాతో చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. “గం గం గణేశా” మే 31 న విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై చాలా ఆకట్టుకుంటోంది. ఉదయ్ భూమిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంద్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నాడు. డైలాగ్ డెలివరీలో కూడా మార్పులు చేసి, కొత్తగా కనిపించ బోతున్నాడు. ట్రైలర్ చాలా సరదాగా సాగుతూ, ఒక పెద్ద నేరంతో మలుపు తిరుగుతుంది. హీరోయిన్ తో కలిసి ఆనంద్ నటించిన లవ్ సీన్స్ కూడా ట్రైలర్ లో ఆకట్టుకుంటాయి. ఒక వినాయకుడి విగ్రహం కూడా ట్రైలర్ లో కనిపిస్తుంది, కానీ ఆ విగ్రహం కథతో ఎలా సంబంధం కలిగి ఉందో సినిమా చూస్తేనే తెలుసు.

ఈ యాక్షన్ డ్రామాలో ఇంకా.. జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యూయేల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గన్ సీన్స్ కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలవబోతున్నాయి. ఇప్పటివరకు సాఫ్ట్ పాత్రల్లోనే నటించిన ఆనంద్, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా మారనున్నాడు. కొత్త నటీనటులతో పాటు, చాలా మంది కొత్త టెక్నీషియన్లతో ఈ సినిమా తెరకెక్కింది.

Leave a comment

error: Content is protected !!