ఇండియన్ టెలివిజన్ షోస్ చరిత్రలో ఎవర్ గ్రీన్ సక్సెస్ గా నిలిచిన షో ఎలాంటి సందేహం లేకుండా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ నే. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో చమత్కార ధోరణితో .. గంభీరమైన తన కంఠంతో .. భారతీయ వీక్షకుల్ని కట్టిపడేసిన ఈ షో ఇప్పుడు 12వ సీజన్ లోకి ఎంటర్ కానుంది. ఈ షో కు సంబంధించిన అత్యధిక సీజన్స్ అమితాబ్ బచ్చనే నిర్వహించగా.. మధ్యలో షారూఖ్ ఖాన్ కూడా వ్యాఖ్యాత గా వ్యహరించారు. అయితే ఇప్పుడు రానున్న 12వ సీజన్ కు కూడా అమితాబ్ బచ్చనే వ్యాఖ్యాత గా వ్యహరించడం విశేషాన్ని సంతరించుకుంది. ఈ నెల 9న బిగ్ బీ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రారంభించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఎప్పటిలాగానే ఈ షో కు భారీ ప్రైజ్ మనీ ఫిక్స్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో అడిగే మొదటి 12 ప్రశ్నలకు ప్రైజ్ మనీ ఒక కోటి రూపాయలు చివరి ప్రశ్నకు మాత్రం రూ. 5 కోట్లు. ఇందులో ఓ ప్రత్యేక లైఫ్ లైన్ “ఆస్క్ యాన్ ఎక్స్పెర్ట్”ను పరిచయం చేయనున్నారు. మిగిలిన రెండు లైఫ్ లైన్లలో ఎలాంటి మార్పు ఉండదు. “ఆడియన్స్ పోల్” “ఆస్క్ ఏ ఫ్రెండ్” లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధావిధిగానే ఉంటాయి. ఇదివరకు ఉన్న 50:50 లైఫ్ లైన్ను మాత్రం ఈ ప్రోగ్రామ్ నుంచి తొలగించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందు దేశవ్యాప్తంగానే గాక ప్రపంచంలోని బిగ్ బి అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. తాజాగా కేబీస్ 12కి సంబంధించి ఆయన అధికారిక ప్రకటన చేశారు. మన జీవితంలో ప్రతి దానికి ఒక బ్రేక్ ఉంటుంది. కాని కలలకి కాదు. . మీ కలలకు కార్యరూపం దాల్చేందకు అమితాబ్ బచ్చన్ కేబీసీ 12తో బుల్లితెరపై రాబోతున్నారు. ఇంక ఆలస్యం ఎందుకు.. మే 9న రాత్రి 9గం.ల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి.. అని అమితాబ్ వీడియో ద్వారా వెల్లడించారు. అతి త్వరలోనే ఈ షో సోనీ టీవీలో ప్రసారం కానుంది.