పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ బేస్ ఎంతుందో అందరికీ తెలిసిందే. తెరపై నటుడిగా, వ్యక్తిగతంగా మంచి మనసున్న మనిషిగా ఆయనను ఆరాధిస్తుంటారు అభిమానులు. అయితే అలాంటి పవర్ స్టార్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం ఈ నెల 13న జరగబోయే లోక్ సభ ఎన్నికల ప్రచారం హడావిడిలో బిజీగా ఉన్నారు పవర్ స్టార్. ఈ నేపథ్యంలో కొన్ని నేషనల్ మీడియా సంస్థలు ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నారు.

ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ అని, తనకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టమని, బైట ఉన్న డెవిల్స్ ను హ్యాండిల్ చేయడం కన్నా తెరమీదున్న డెవిల్స్ ను చూస్తూ ఎంజాయ్ చేయడం తనకు ఇష్టమని పవర్ స్టార్ చెప్పారు.

Leave a comment

error: Content is protected !!