అందమైన కళ్ళు.. అమాయకమైన చూపులు.. కనికట్టు చేసే సౌందర్యం.. కట్టి పడేసే శరీర సౌష్ఠవం… అందాన్ని , అభినయాన్ని రెండు కళ్ళు గా చేసుకొని .. రెండు దశాబ్దాల నుంచి  భారతీయ తెరమీద అందాల విందు చేస్తోంది ఆమె.  ఆ సుందరి. పేరు అమిషా పటేల్ .   హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా మెరిసింది. మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి.. కథానాయికగా ఎదిగి..  నిర్మాతగా మారిందీ ముద్దుగుమ్మ.

హృతిక్‌ రోషన్‌తో కలసి తొలిసారిగా రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా ‘కహోనా ప్యార్‌ హై’లో నటించి అందరినీ ఆకట్టుకుంది. వెంటనే తెలుగులో పవన్‌కల్యాణ్‌ సరసన ‘బద్రీ’లో నటించింది. కానీ అంతగా ఆమెకు పేరు రాలేదు. మరో ప్రేమకథా చిత్రం ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’తో విమర్శకుల ప్రశంసలందుకుంది. దీనికిగాను ఆమెను తొలి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వరించింది. తర్వాత వరుస పరాజయాలతో సతమతమయ్యింది. ఇక ‘హమ్‌రాజ్‌’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్టుకొట్టింది. తెలుగులో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబుతో ‘నాని’లో నటించి ఓకే అనిపించింది. ఎన్టీఆర్‌తో చేసిన ‘నర్సింహుడు’లో అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత అక్షయ్‌ కుమార్‌తో నటించిన ‘భూల్‌ భులాయియా’ చిత్రంతో అగ్ర కథానాయకుల జాబితాలో చోటుదక్కించుకుంది. ఆ రోజుల్లో బాలీవుడ్‌లో శృంగారతారంటే అందరికీ గుర్తొచ్చే నటి అమీషా పటేల్‌ మాత్రమే. ఆ తర్వాత వరుస పరాజయాలతో జైత్రయాత్రను కొనసాగించలేకపోయింది. తర్వాత కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో అలా కనిపిస్తూ వచ్చింది. సల్లూభాయ్‌ ‘రేస్‌ 2’ చిత్రంలో ప్రత్యేకంగా కనిపించింది. జంతు సంరక్షణ కోసం ఉద్యమం నిర్వహించింది. 2004లో దేశంలో సునామీ సంభవించినప్పుడు ఆర్ధిక సాయమందించింది. కనవ్‌ పూరితో ప్రేమ వ్యవహారం నడిపిన అమీషా ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. నేడు అమీషా పటేల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ సుందరికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే అమీషా పటేల్

Leave a comment

error: Content is protected !!