సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఎంత బాగా నచ్చిందో.. అంతకంటే సినిమా బాగా నచ్చుతుందన్నారు నటి శరణ్య ప్రదీప్. ఈ సినిమాలో కులాల ప్రస్థావన ఉంటుంది కానీ ఏ కులాన్ని కించపరచలేదన్నారు దర్శకుడు దుష్యంత్‌ కటికనేని. కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. నిమా మేకింగ్ లో నాకు సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు దర్శకుడు దుష్యంత్.
సినిమా మీద మీరు చూపిస్తున్న రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది. థియేటర్స్ లో డబుల్ ధమాకాలా మా మూవీ ఉంటుందని ప్రామిస్ చేసి చెప్పగలను అన్నారు హీరోయిన్ శివాని నగరం.
ను నిర్మాతగా మీ ముందు నిలబడటానికి కారణం అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు. మా సంస్థలో ఏదో ఒక సినిమా చేసేద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా చేస్తే తప్పకుండా హిట్ మూవీనే చేయాలి అనుకున్నాం. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” కథ వినగానే బన్నీ వాస్ గారు నేను చాలా ఎగ్జైట్ అయ్యాం. సుహాస్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి మూవీ చేశాడు. మా ప్రతి సినిమాకు అల్లు అర్జున్ సపోర్ట్ ఉంటుంది. మా సంస్థలో చాలా మూవీస్ రాబోతున్నాయి. అరవింద్ గారి పేరు నిలబెట్టేలా ప్రతి సినిమాకు కష్టపడతాం అన్నారు నిర్మాత ధీరజ్‌ మొగిలినేని.
నాకు నిన్న బాబు పుట్టాడు. ఆ హ్యాపీనెస్ లోనే ఉన్నాను. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ట్రైలర్ కు మీ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ. ఫిబ్రవరి 2న మా సినిమాకు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు హీరో సుహాస్.

Leave a comment

error: Content is protected !!