Vettaiyan OTT : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’. తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
రజినీకాంత్ గత చిత్రాలతో పోలిస్తే, ‘వేట్టయాన్’ తెలుగులో అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించినంతగా లేకపోవడం గమనార్హం. సినిమా టైటిల్ వివాదం కూడా ప్రేక్షకుల ఆసక్తిని కొంతవరకు తగ్గించిందని చెప్పవచ్చు. సినిమా విడుదలైన నేపథ్యంలో, ‘వేట్టయాన్’ ఓటీటీ హక్కులు ఎవరి వద్దకు వెళ్లాయనేది ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగించింది.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. సుమారు రూ. 100 కోట్లతో ఈ హక్కులను అమెజాన్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను సన్ టీవీ రూ. 65 కోట్లకు కొనుగోలు చేసింది. సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తున్న నేపథ్యంలో, ‘వేట్టయాన్’ ఎక్కువ కాలం థియేటర్లలో ఆడే అవకాశం లేదు. ఈ సినిమా సుమారు 3 నుంచి 4 వారాల్లోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రసారం కానుందని అంచనా.