అందంలోనూ, అభినయంలోనూ అందెవేసిన చెయ్యి మల్లూ కుట్టి అమలాపాల్ . వివాదాత్మకమైన పాత్రల్లో నటించడమే కాకుండా.. వివాదాల్లోనూ కూడా తలదూర్చడం అమ్మడి స్టైల్. సౌత్ లో కథానాయికగా మంచి బిజీగా ఉన్న టైమ్ లోనే తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ను ప్రేమించి పెళ్ళిచేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి మనస్ఫర్ధలొచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ మరోపెళ్లి చేసుకోవడం.. అమలా పాల్ మళ్లీ సినిమాల్లో తిరిగి బిజీ అయిపోవడం జరిగింది. ఇప్పుడు అమలా పాల్ వంతు వచ్చింది. అమ్మడు మళ్ళీ పెళ్లి చేసుకోవడడం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
విజయ్ విడాకులు ఇచ్చిన తర్వాత అమలాపాల్ .. ముంబైకి చెందిన భవీందర్ సింగ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ దిగిన ఫోటోలు చాలా సార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రీసెంట్ గా అమలాపాల్ భవీందర్ ను పెళ్ళిచేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అతడితో ఆమె వైవాహిక జీవితం ఆనందమయం కావాలని ఆశిద్దాం.