పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే సామెతను నిజం చేస్తూ.. ఇన్నాళ్ళూ భారతీయులమైన మనం .. లోకల్ ప్రొడక్ట్స్ కు అసలేమాత్రం ప్రాధాన్యతనివ్వకుండా.. పక్కనే ఉన్న చైనాను తెగ ప్రోత్సహించాం. దాని వల్ల మన ఆర్ధిక వ్యవస్థ బలహీనమైంది, చైనా ఆర్ధికంగా పుంజుకుంది. అందుకే మనం భారతీయ కంపెనీల ఉత్పత్తులును కొనడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందామంటూ నిపుణులు చెబుతూనే ఉంటారు. కానీ మనం పాటించడం లేదు. అయితే ఇప్పటికైనా దీన్నొక ఉద్యమంగా చేపట్టి.. చైనీస్ గూడ్స్ ను బ్యాన్ చేసే ప్రక్రియను మొదలు పెట్టడం మనచేతుల్లోనే ఉంది.
ఆ పని పెద్ద సెలబ్రెటీనే చేయాల్సిన పని లేదు. తన లాంటి చిన్న హీరో కూడా చేయొచ్చని అల్లు శిరీష్ చూపించాడు. దేశ సరిహద్దుల్లో చైనాతో యుద్ధంలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాయ్ కాట్ చైనా గూడ్స్ ఉద్యమం మొదలైంది. ఇందులో టాలీవుడ్ నుంచి శిరీష్ కూడా భాగమయ్యాడు. ‘‘నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకమీదట వీలైనంత వరకు స్వదేశీ బ్రాండ్స్ వాడదాం అని. దీని ద్వారా మన స్వంత ఎకానమీను బలోపేతం చేయవచ్చు. విదేశీ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోవడం అసాధ్యమైనది. కానీ వీలైనంత వరకు లోకల్ కొనండి. మనలో చాలామంది భారతీయ బ్రాండ్స్ ఉపయోగించడం ఆకాంక్ష కాదని భావిస్తారు. కానీ ఇకమీదట ఆలా కాదు. లోకల్ బ్రాండ్స్ వాడదాం. వాడుతున్నట్లు పైకి చెప్పుకుందాం. దయచేసి గో లోకల్.. బీ వోకల్… అంటూ పిలుపునిచ్చాడు. మొన్న నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్న సామాన్లు. అన్ని భారతీయ బ్రాండ్స్’’ అంటూ తాను కొన్న ఉత్పత్తుల ఫొటోలు పెట్టాడు శిరీష్. అతడి పోస్టుకు ట్విట్టర్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
మొన్న నేను సూపర్ మార్కెట్లో కొనుక్కున్న సామాన్లు. అన్ని భారతీయ బ్రాండ్స్.
మనలో చాలామంది భారతీయ బ్రాండ్స్ ఉపయోగించడం, ఆకాంక్ష కాదని భావిస్తారు. కానీ ఇకమీదట ఆలా కాదు. లోకల్ బ్రాండ్స్ వాడదాం. వాడుతున్నట్లు పైకి చెప్పుకుందాం. దయచేసి #GoLocalBeVocal. pic.twitter.com/sSQvuFS4f0
— Allu Sirish (@AlluSirish) June 17, 2020