ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సినిమాగా ఆర్య నిలిచిపోతుంది. సుకుమార్ కు ఇది డెబ్యూ మూవీ. బన్నీకి రెండో సినిమా. అప్పట్లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరై.. బన్నీని తన కెరీర్ లో ఇక వెనుతిరిగి చూడకుండా చేసింది. 2004, మే 7న రిలీజైన ఆర్య సినిమా సరిగ్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు, హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేక వేడుక జరుకున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు బన్నీ ఆర్య సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
తొలి సినిమా గంగోత్రి బ్లాక్ బస్టర్ హిట్టైనా హీరోగా అల్లు అర్జున్ కు సరైన పుషప్ ఇవ్వలేకపోయింది. ఆ సినిమా తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉండి.. రవితేజ ఇడియట్ లాంటి యూత్ ఫుల్ మూవీ చేయాలి అనుకుంటున్న తరుణంలో బన్నీకి సుకుమార్ కలిసి ఆర్య కథ వినిపించగానే.. మైండ్ బ్లోయింగ్ అనుకున్నాడు బన్నీ. అయితే కథంతా బాగుంది, సినిమా చేయాలి అనుకొనే టైమ్ లో తండ్రి అరవింద్ కు, నిర్మాత దిల్ రాజుకు, తనకు .. సుకుమార్ గురించి చిన్న అనుమానం. ఈ సినిమాను తను అనుకున్నట్టుగా హ్యండిల్ చేయగలడా లేదా అని.
ఆ టైమ్ లోనే దర్శకుడు వివి వినాయక్ అన్న ఒక మాట మా అందరి జీవితాల్ని మార్చేసింది. ఆ కుర్రాడ్ని నమ్మండి. బాగా తీస్తాడు. మీకు అతను తీసే సీన్స్ మీద సాటిస్ఫేక్షన్ లేకపోతే నేనొచ్చితీస్తానని మాటిచ్చాడు. అందుకు వినయక్ కు నేను మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. ఆర్య మూవీ నా జీవితంలో మరపురాని సినిమా గా నిలిచిపోయింది. అంటూ ఒక మంచి మెమరీని షేర్ చేసుకున్నాడు బన్నీ.