గతవారం కరోనా బారిన పడిన అల్లు అర్జున్‌ తగిన జాగ్రత్తలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌ దిశగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ బన్నీ సన్నిహితులు, అభిమానులు తనపై ఉన్న అభిమానాన్ని, ప్రేమను సామాజిక మాధ్యమం ద్వారా పోస్టులు పెడుతూ అభిమానాన్ని చాటుకున్నారు.

తాజాగా తన హెల్త్ స్టేటస్ వివరాలను తెలియచేస్తూ ఒక పోస్ట్ చేశాడు బన్నీ. అందులో తన ఆరోగ్యం బాగుందని, ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నానని కానీ ఇంకా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటునానని తెలియపరిచాడు. తను కోలుకోవాలని వేడుకునే ప్రతీ ఒక్కరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియచేశాడు.

అల్లు అర్జున్ ట్వీట్ :

‘అందరికీ హలో.. స్వల్ప లక్షణాలే ఉన్నాయి.. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది.. కరోనా నుంచి కోలుకుంటున్నాను.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. మీరు చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’

Leave a comment

error: Content is protected !!