ఈ ఏడాది  బిగినింగ్ లోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.  కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు దీర్ఘ విరామం ఏర్పడింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరగనుంది.  ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం బన్నీ తన మేకోవర్ ను, బాడీ లాంగ్వేజ్ నే కాకుండా… తన లాంగ్వేజ్ ను సైతం పూర్తిగా మార్చుకుంటున్నాడు. 

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం బన్నీ కసరత్తులు జోరుగా కొనసాగుతున్నాయి. రోజూ అల్లు అర్జున్‌ – సుకుమార్‌ విస్తృతంగా చర్చించుకుంటూ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ఇందులో అల్లు అర్జున్‌ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. మొన్నటిదాకా సినిమాలో తాను పలికే సంభాషణలపైనే దృష్టి పెట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా పూర్తి స్థాయిలో యాస సొగసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అది తన పాత్రకి మరింత మేలు చేస్తుందనేది అల్లు అర్జున్‌ ఆలోచన అని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Leave a comment

error: Content is protected !!