Allari Naresh : అల్లరి నరేశ్ హీరోగా నటించిన “బచ్చల మల్లి” సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. అమృత అయ్యర్‌ కథానాయికగా నటించగా, రావు రమేశ్, రోహిణి, అచ్యుత్‌ కుమార్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం, రిచర్డ్‌ ఎం.నాథన్‌ ఛాయాగ్రహణం అందించారు.

రా అండ్‌ రస్టిక్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నరేశ్‌ ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా ఒక శక్తిమంతమైన మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా డబ్బింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమా అల్లరి నరేశ్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. యాక్షన్‌, కామెడీ, డ్రామాతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!