అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనపని అన్నారు ఆత్రేయ గారు.. అయితే ఇప్పుడు కాస్త మార్చి అనుకున్నవన్నీ జరగవు కొన్నిఅంటూ ఓ సినిమా రూపొందుతుంది. అల్లరి నరేష్ చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లాంచ్‌ చేసారు. జీ. సందీప్‌ దర్శకత్వంలో శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా శ్రీ భారత ఆర్ట్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో అల్లరి నరేష్‌ హీరోగా వచ్చిన సిల్లీ ఫెలోస్ కు సందీప్ అసిస్టెంట్ డైరెక్టర్‌ గా వర్క్ చేసాడనీ, ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నందున పోస్టర్‌ లాంచ్‌ చేసి విష్‌ చేస్తున్నానన్నారు అల్లరి నరేష్‌.

క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌ తో రాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనీ..ఖచ్చితంగా చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందనీ, అల్లరి నరేష్‌ పోస్టర్‌ లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు చిత్ర హీరో శ్రీరామ్‌.

నవంబర్‌ 3న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. మా సినిమా పోస్టర్‌ విడుదల చేసిన నరేష్‌గారికి థ్యాంక్స్‌’’ అని అన్నారు చిత్ర దర్శకుడు సందీప్‌.

Leave a comment

error: Content is protected !!