Allari Naresh : కామెడీ హీరో అల్లరి నరేశ్.. విభిన్న కథాంశాల హీరోగా టర్న్ అయ్యాకా సక్సె్స్ రేట్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తన 63వ చిత్రం “బచ్చల మల్లి” సినిమా ఘనంగా ప్రారంభమైంది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించే ఈ చిత్రానికి సుబ్బు మంగాదేవి (‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు.

1990 నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఓ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. నరేశ్ కొత్త లుక్‌లో, ఇంటెన్స్ కేరక్టర్ లో కనిపించనున్నారు. అమృత అయ్యర్ కథానాయిక. కోట జయరామ్, రోహిణి, రావు రమేశ్, సాయికుమార్, ధనరాజ్, హరితేజ, ప్రవీణ్, ప్రసాద్ బెహరా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. కొత్తతరం యాక్షన్ డ్రామాగా, ఓ విభిన్నమైన కథతో తెరకెక్కుతోంది. నరేశ్ కొత్త లుక్‌లో, ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది” అని చిత్రబృందం తెలిపింది.

Leave a comment

error: Content is protected !!