అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడివి శేష్‌ అతిథిగా హజరయ్యారు. దర్శకుడు మల్లి తెరకెత్తిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ “డైరెక్టర్‌గా మల్లికి ఇది తొలి సినిమా. నేను ఇప్పటివరకు 32మంది దర్శకులతో పనిచేశాను. వాళ్లందరూ రిలీజ్‌కు ముందు ఒత్తిడి గురయ్యేవారు. కానీ, మల్లి మాత్రం నవ్వుతూ ఉన్నారు. అలా ఉండడం చాలా గ్రేట్‌. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఫరియా అబ్దుల్లాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆమె ఉన్నత స్థానాలకు వెళ్లాలి. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా అందరినీ నవ్విస్తుంది. పెళ్లి పేరుతో జరుగుతోన్న మోసాలను ఇందులో చూపించాం. మీ అందరూ కూడా తెలుసుకోవాలి.

అడివి శేష్‌ మాట్లాడుతూ “నరేశ్‌ నాకు మంచి ఫ్రెండ్‌. నా మొదటి సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఆయనే గెస్ట్‌గా వచ్చారు. నరేశ్‌ అంటే నాకు ఇంట్లో వాళ్లతో సమానం. ఫరియా అబ్దుల్లా మంచి అమ్మాయి. ఈ చిత్రబృందంలో చాలామంది నా కెరీర్‌ ప్రారంభంలో సపోర్ట్‌ చేశారు. అందుకే ఈ సినిమా నాకూ ప్రత్యేకమైనది. ఈ చిత్రం ప్రేక్షకాదరణ సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.

Leave a comment

error: Content is protected !!