Nandamuri Kalyanram : నందమూరి కళ్యాణ్ రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆయన తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది 2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బింబిసార’కు ప్రీక్వెల్. ‘బింబిసార 2’ టైటిల్ తో తెరకెక్కుతోంది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కొసరాజు హరికృష్ణ నిర్మించనున్నారు. అనిల్ పాదూరి గతంలో ‘రొమాంటిక్’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ‘బింబిసార’ చిత్రానికి కూడా ఆయన విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.

“బింబిసార కంటే యుగాల ముందు త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన చక్రవర్తిని చూడటానికి సిద్ధంగా ఉండండి” అని చిత్ర పోస్టర్‌లో పేర్కొన్నారు. త్రిగర్తల రాజ్యాన్ని అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులకు చూపించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ‘బింబిసార 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఇంకే రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!