War 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత 2023లో ఎన్టీఆర్ సినిమా రాలేదు. కానీ ఈ ఏడాది ‘దేవర’ సినిమాతో తారక్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే, వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ షురూ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా లాంచింగ్ కూడా అయిపోయింది.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో తారక్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కథానాయికగా నటించనుంది. అది కూడా యన్టీఆర్ కు జోడీగా నటించబోతోంది. ఆర్.ఆర్.ఆర్ మూవీలో ఆలియా భట్ నటించినా.. ఆమె తారక్ జోడీగా నటించలేదని అందరికీ తెలుసు. జూలై చివరి వారంలో అలియా భట్ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!