Double Ismart : పూరి జగన్నాథ్ అంటేనే పవర్‌ఫుల్ డైలాగులు, హీరోయిజం తో పాటు అలీ క్యారెక్టర్. అలీని తన సినిమాల్లో ఎంతో ప్రత్యేకంగా చూపించడంలో పూరి సిద్ధహస్తుడు. అందుకే పూరి సినిమా అంటే అలీ ఎలా ఉంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో కూడా అలీ క్యారెక్టర్ అదిరిపోయిందని ఇన్‌సైడ్ వర్గాల సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’లో అలీ లేకపోయినా, ‘డబుల్ ఇస్మార్ట్’లో అలీ కోసం ప్రత్యేక పాత్ర డిజైన్ చేశారు. అలీ గెటప్ చాలా వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది.
‘డబుల్ ఇస్మార్ట్’ పనులన్నీ పూర్తయ్యాయి.

టీమ్ మొత్తం ఫైనల్ కాపీ చూసుకొని ఫుల్ హ్యాపీగా ఉంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. రామ్ – సంజయ్ దత్ ల మైండ్ గేమ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మాస్ పాటలు జనంలోకి వెళ్లిపోయాయి. మణిశర్మ ఆడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘లైగర్’తో డిజాస్టర్ లో పడిన పూరి.. ‘డబుల్ ఇస్మార్ట్’తో మళ్లీ కమ్ బ్యాక్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!